Powered By Blogger

Appaji




వెన్నెల నిండిన నవ్వులవి, 
కరుణను కురిసే కన్నులవి, 
భయమును బాపే గురు సన్నిధి, 
సచ్చిదానంద!  మీ పాదమే మాకు సద్గతి. 
****************************************************************************************************************



హంస నంది రాగ సాగర





'హంస'ల గుంపులు, ముదమున ఎగసే 

'నంది'త హృదయము నందనమాయే 
'రాగ'మునందున అమృత ధారాల
'సాగర'మున సద్గురువు లభించే
---------------------------------------------------*********-------------------------------------------------
Guru Jyothi Raga Sagara 


You have taken form of beloved                     "Guru"
To enlighten our hearts with gnana                   "Jyothi"
For which you have been using and creating    "Raga"s 
There by giving us "bliss" as big as                   "Sagara"

---------------------------------------------------*********-------------------------------------------------


శ్రీ గురు దత్త      జయ గురు దత్త


మీ సన్నిధిలో ఒక్క క్షణం,
తరించు ప్రతి జీవి కణ కణం.
నా గుండెల్లో సాగుతూంది ఓ రణం,
నన్ను నేను గెలిచేందుకు, మీ పదమే ఇక శరణం.
నిఖిల జగతి సృష్టి, స్తితి, లయలకు  మీరే కారణం,
మదిలో వెలుగై నడిపించే మీరే మా జీవన భరణం.
దిక్కు తోచని స్తితి లో మీ నవ్వే భవ తారణం,
అందుకే మా మనస్సు ఎల్లప్పుడు కోరుతుంది మీ శ్రీ చరణం.
వివశ్వన్