Powered By Blogger

Hanuman Charitra 2

Episode 26


వనాలు పట్టుకు తిరుగుతున్న, ఆ వానర బుద్ధి, 
నిశ్చలమ్మై పొందునా, సచ్చిదానంద సిద్ధి ? 
వేగుల వలన విషయాలు తెలుసుకునే కొద్ది, 
ఊగులాడే సుగ్రీవు-మది ఏదో ఆశ కొద్ది 
***
వానర రూపంలో ఉన్నా, అద్భుతానంద స్థితినున్న,
ఆంజనేయుని ధ్యానాన, గోచెరమాయే వింత రోదన, 
నగల మూటను విసిరి చటుక్కున, వెడలె విమానం దక్షిణ దిక్కున, 
రావణ హస్తం ఉండునా, ఈ అక్రుత్యాన, అనుచు అంతా నిలచిరి ఓ అనుమానాన! 
***
Episode 27


 గుర్తుపట్టాలని తానెళ్ళిన బాట, ఆనవాలు గా వదలె ఆ పడతి ఈ మూట,
వస్తారు ఆమె కొరకు ఏదోఒక పూట, వెతుక్కుంటు తన వారు అనుకొన్నారట,
కొన్నాళ్ళకు తెలిసెను గుండె పగులు మాట, దశకంఠ విమానాన చిక్కుకున్న వనితా
రోదిస్తూ వెళ్లినామే సీతయే నట, ఇన్నితెలిసినా పరిస్థితుల వలన, తప్పలేదు వారికి ఊరకుండుట.
***
Episode 28

పంపా తీరం దుఃఖ-దూరం సౌందర్య సారం హనుమ ప్రియ విహారం, 
చేరి చూడగా పర్వత శిఖరం గోచరమాయే ధృడ ఆకారం, 
హనుమ మది లో మమకారం సుగ్రీవుకు మాత్రం విచారం, 
స్వామి పై వేసి సర్వ భారం, చెయ్యమన్నాడు రాయభారం.
***


Episode 29




మాటల తోటల వనమాలి, విద్యలు ఉండెను నీ లోపలి,
నీకు తెలియనిది అంతా ఆవలి, రక్షకుడా భజరంగ-బలి,
నన్ను హతమార్చేందుకు, పంపాడేమో వీరిని వాలి,
అదినిజమైతే చూపకు జాలి, లేకుంటే అర్పించు చెలిమి నివాళి.

**
పోగిదేకొద్దీ పొంగే స్వామి,
ఉంటె చాలు ఆయన హామీ,
స్మరణను తప్ప కొరడు ఏమి,
లేదు హనుమకు సరిసాటి, ఈ భూమి!

**
ఉనికి తెలుపరు ఓ పట్టాన, భేదించ లేదు ఏ చిక్కు ప్రశ్న,
కనిపెట్టార నా నటన, అనుకొనే హనుమ లోలోన,
ఆ ఇరువురిలో పెద్దవాడిని, చూసి పొంగెను ఎద యమున,
నిజ కథ అంతా తెలిపే స్వామికి, శ్రీరాముడుండ, అసత్యముండునా?

***
Episode 30




దోషం లేని మాటల రేడు, దోషాలన్నీ పోగొడతాడు,
శిక్షా శాస్త్రం శిరమున చూడు, వ్యాకరణానికి నోరే గూడు
ఛందస్సుకు గమ్యంమ్మీతడు, నిరుక్తమంతా నిర్వచనీయుడు,
సూర్య సుతునికి మంత్రి ఈతడు, లక్ష్మణా ఈ హనుమను చూడు!!!
**
అగ్ని సాక్షిగా కుదిరెను చెలిమి, 
సుగ్రీవు పొందె అభయపు కలిమి,
ఇక బాధించదు కష్టాల కొలిమి, 
రామయ్య ఉండగ దేనికి లేమి ?
**
విడిచిపెట్టి ఈ మూటడు నగలు, సీతమ్మ వదిలెను ఆనవాలు,
అది చూసి రెట్టించే రామయ్య దిగులు ఆక్షణానే మూర్చిల్లు, 
దుద్దులు గాజులు భుజకీర్తులు ఇవి ఏవి తెలియవు అసలు, 
ఉదయానే నే ప్రణమిల్లు అమ్మ పాదపు అందెలు, ఇవిగోననుచు సౌమిత్రి రోదిల్లు.
***

No comments: