Powered By Blogger

Hanuman Charitra-1


శ్రీ ఆంజనేయా హరి, అంజన పుత్ర,
మారుతి నిండేకద, సర్వత్ర
హనుమా! హర్షదా!! ఓంకార గాత్ర,
సచ్చిదనందకరా, అద్భుత మాత్ర..


యుగం మారింది జగం మారింది, కాల చక్రము ఆగనంటోంది ,
ఏరు పారింది అంబుధి దాక, ఆవిరై చేర అంబర వాటిక, 
మార్పు తనోకటే నిత్యమంతోంది, ప్రకృతి ఆణువణువూ మారిపోతోంది, 
ఇన్ని మారినా ఒకటి స్థిరమండి హనుమ రూపమగు  శ్రీ రామ భక్తీ.




తామస భక్తీ తో వరము పొందినా, 
సత్వ భక్తీ కది సమమయ్యేనా?
గార్ధభమౌ మది మోహము నందున,
సచ్చిదానందుని చూడ జాలునా ?




నిన్ను నువ్వు మార్చుకుంటే, రోజుకొక్క తీరుగా,
ఓటమోచ్చి మింగుతుంది, వేరు వేరు రీతిగా,
లోకానికి మేలు చేయి, కుదిరినంత విరివిగా, 
శుభము కూర్చి నిన్ను కాచు శివగురువే సాక్షిగా.



దురిత క్షయకారి, సకల శుభాల-ఝరి, శ్రీ హరి, 
ఆ హరి భక్తికి దాసుడాయే, మదన మదాపహారి, 
ఒకరికొకరు సాయమై, చూపుతున్నారు మనకు దారి, 
హరి-హరులకు బేధము, అను దండగ వాదము, ఇకనెందుకు మరి? 


పగలు రేయి, దిగులూ హాయి, మనల వీడని చుట్టాలు,
ద్వంద్వ భావనను దులిపివేయగా పరమాత్మ చుపేను చిత్రాలు,
అద్వితీయమగు శక్తినే చేసి భువికంపిన పధ్ధతి చాలు, 
ఇంకేమని నే వర్ణించాలి? సచ్చిదానందుని అద్భుత లీలలు ? 

హరి సర్వోత్తమ ప్రణాళిక, సకల దేవతా శక్తి కలయిక,
అది మింగేసిన హరునికిక, కపి కావాలని కలిగే కోరిక,
అగ్నికి అమ్మ, వాయువుకనలుడు, అందించిరా శక్తి, లేక ఓపిక, 
ఏ ఉపాయము తోచక, పవనుడు వృషభాద్రి సోక, హేళన చేసే గాంధర్వ బాలిక, 
జరిగేదంతా మంచెగా అనుకుంటే ప్రతి ఆర్తి అణుగు గా, ఒనగూడ హరి-హరుల కృప, ఇక!!




పూర్వ పుణ్యమే తోడుంటే, శాపం కుడా వరమగులే, 
ఆ పుణ్యం సమకురాలంటే, సత్కర్మ చేస్తే చాలులే, 
కర్మ బలమున, జన్మ జన్మలకు జతకారా ఇక, దేవతలే ?
సచ్చిదనందుడు ఘన యాగమందు నిను వాడుకోను, ఓ సమిధ వలె.


సజ్జనులకు చేస్తే హాని, ముప్పు తప్పదు ఎవ్వరికైనా,
సాంబశివుని మది, నెరనమ్మి, కొలిస్తే కోర్కె తీరుకుండునా?
తప్పు ఒప్పుల తీర్పు మానుకొని, నిష్కామంగా కర్మచేసిన,
సచ్చిదానందుని దయ ప్రసరించి, శాంతి-సద్గతులు దొరకుండునా?




అమ్మ లేకుంటే అస్తవ్యస్తము, ఆమె దయ తోటి మనకు స్వాస్త్యము,
ఆమె కల్పించి నడుపు నాటకము, సాగించుటకు మార్చు రూపము, 
తల్లికి ఇచ్చే రాతి రూపము, కుతురికేమో కోతి రూపము,
నారద మౌనికి తెలుసు మర్మము, సచ్చిదానందుని నిజ స్వరూపము. 




చింత నెత్తికెత్తుకుని, చికాకును హత్తుకుని, దిగులే దైవమంటే, అంతేగా నీ పని,
చక్కనైన పని చేస్తే, చెత్త మదిని తీసేస్తే, పంపేను పరమాత్మ పనికట్టుకుని,
చిక్కులన్నీ విడతీసే, చక్కనయ్య నామాన్ని, పాడుకునే నారదుని, నీ కోసమని,
నమ్మకమే పెంచుకో, కుదిరినంత పంచుకో, నిన్న నేడు రేపులన్ని తెలిసిన వాని.




నిన్న ఏమి చేశావో గుర్తు లేదు,  మరునాటి జాడ మనకు అసలే లేదు, 
ఇలా జరిగిందే అని ఆలోచన వద్దు, విభుడు చూపు బాటనంటి పోవుటయే కద్దు,
గురు వాక్యం పాటించి నిన్ను నువ్వు దిద్దు, వాయు వేగాన తేల్చు శివుడు నీ పద్దు, 
అప్పుడింక నీ హాయికి ఉండదు ఏ హద్దు, సచ్చిదానందం మది నిండు జగతికి ప్రతి పొద్దు. 




దూకబోకు దూకబోకు దుందుడుకుగా, 
దారి మారి, తీరు మారు, వింత వింతగా, 
అపాయాలు ముసిరినాను, నీవు దడవక, 
కొలిచావో సచ్చిదానందుడింక, నిన్ను కాచుగా.




తోకలోన పుట్టినోడు వాలి, ఇంద్రానుగ్రహ బలశాలి,
సూర్య స్పర్శతో ఉదయించే, ఈ సుగ్రీవుడు ధీశాలి, 
విభిన్నమగు స్థితి ఎపుడైనాను, రాదు నీచెంత పనిమాలి,
తగులు ప్రతి దెబ్బ, శిల్పముగ నిను మలచు, కాలమే పరమాత్మ ఉలి.


గ్రహపతిని ఫలమనుచు గ్రహింప బూని,
అవలీల దాటేవు మండలాలన్నీ
అమరపతి చుపెనా? ఆయుధపు రుచినీ!!
ఆటలో వదిలేవు బలారిష్టన్ని,
ఓ హనుమ పాడేద నీ దివ్య కథని, శివమిచ్చి దీవించు సకల లోకాన్ని!



వడిలిపోయిన సుతుని చూసుకొని, వాతపతి మనసాయె సోక-గని,
ఉపసంహరించి, తన ఉనికిని-జగతిని, ఉరకుండే ఒక గుహను-జని,
సకల దేవతలిక, తాళలేమని. ఆశ్రయించిరా విరించిని,
విధేయుడై ఇక వాయునాథుడు, ప్రణమిల్లె, విధత-గని. 







ప్రదక్షినమ్ముల్లు వాయువు చేయ, ప్రసన్నుడాయే ఆ బ్రహ్మ,
జగతికి మరల స్వస్థితి కూర్చగ, చలనమునందే కలియుగ బ్రహ్మ,
పంచభూతాలు, అస్త్ర-శాస్త్రాలు, నీకు కంటకం కావిక సుమ్మా,
అని అనిమిషులు, వరముల నివ్వగ, విధాత చేతిలో మెరిసెను హనుమ. 






అంతులేని అల్లరి కద, అంజనా సుత  నీది,
నా అస్త్రం కుడా, నిను ఆపదు, అని, పలికె విధి,
వాయుదేవు, అలక వలన, నీ-కొత్త శక్తి దాటే అవధి,
గురుకులాన ప్రతి నిత్యం భంగమాయె సమాధి. 




స్తుతితో మాత్రం స్మ్రుతి కొచ్చునులే నీలో శక్తి పవన సుత, 
వ్యర్ధ వ్యయమ్ము న్యాయమ్మగునా, ఆలకింపుమా సకల నుత, 
సూర్య దేవుని వద్ద విద్యలని, నేర్వమని పలికె అంజనా మాత, 
ఆగని-సూర్యుని శిష్యరికం, అర్క-సూనుని మైత్రిబంధం, 
సౌర కుటుంబపు బంధువు నీవయ, సచ్చిదనందన్నిచ్చేవు నిరత.


ఏ కార్యం చేస్తున్న కర్తవ్యం మానకు, 
తోలి పాఠం  చెప్పకనే, చెప్పే ఖగుడు హనుమకు, 
ఒకవారం గురువు వెంట ఆపని ఆ పరుగుకు
విద్యలన్ని వశమాయే మన అందరి ఒజ్జకు. 

అతి అన్నది ఎప్పటికి నీ చెంతకు చేరనీకు 
సమ తూకం పాటిస్తే జీవితమే తీపి చెరకు 
కళ్ళు మూసుకున్నందుకు వచ్చేగా యెముడు
చెంచెలమ్ము చూపిస్తే యమున తేలే తుదకు
ఏమార్గం పట్టునో సూర్య-సతి ముందుకు, 
మనమంతా సాగుదాము శ్రీ దత్తుని చెంతకు.



మండు మార్తాండు, ముందు పడలేక, ఛాయను చేసి వెడలే, సంజ్ఞా,
మగని వదలుట, తండ్రి వలదనిన, చేరె అడవుల అశ్వ రూపమున, 
ఆ శని తల్లి చూపు వివక్షతో, విషయము తెలసి వెతకే లోకాన, 
సూర్యుడు, పడతీ, పిల్లల ప్రేమకై, తేజము వదలె యంత్రమున,
విడిచిన తేజము నుండి వచ్చెను హనుమంతునికి తగిన ఒక కూన.




సూర్య తేజస్సు నిండిన బాల, తపోనిష్టగల సువర్చల,
ఆమెను తగిన వరునికిచ్చిన, శుభము నిండుగా మూడు లోకాల,
అనుకుని అర్కుడు ఆంజనేయునికి ఆ ఆలోచన తెలిపినంతలా,
శ్రీగురు అజ్ఞ బహు గూఢమ్మని గైకొనే వర్చెసు, పవన సూనుడు, సంతసించిరి దేవతలెల్ల!!




గంధమాదన పర్వత శిఖరిని  చేరెను అయ్యా, అమ్మను తోడ్కొని,
కొలిచినవారి కొంగుబంగారుగా వరములనోసగిరి ఇరువురు ప్రేమని,
కనువిందగు ఆ గిరిని ఒకరూపు మరు రూపు సేవించే తల్లీ, తండ్రిని, 
సచ్చిదనందుడు మనకు చూపెను, కారుణ్య మూర్తిని, ఒంటె వాహనుని. 




అంతులేని తపము చేసి వాలి-సుగ్రీవులు, పొందినారు ఎన్నెన్నో అపురూప వరాలు,
వలినెవరు ఎదుర్కొన్నా రణ భూమి లో, వారు కోల్పోతారు సోగం శక్తులు, 
అర్ధించి అర్ధించి హనుమంతునికిచ్చిరి, ఆలోచన సరిదిద్దే అమత్యుని బాధ్యతలు,
పొగిడినంత పెంపొందే హనుమ బుద్ధి శక్తులు, ప్రమోదమే పొందినారు ఆ రాజ్య ప్రజలు.

రక్కసుల కూల్చు వాలి ఆదమరచి తూలు, 
ఋష్యమూక మడుగిదకని మందలించే ముని పలుకులు,
మాయవిని ఎదుర్కొని వాలి చేసే మరో పోరు, గుహ వెలుపల పారినది రక్తపుటేరు, 
ఇది క్షేమం కాదని ఆ గుహద్వారం ముసినారు దీర్ఘాలోచన చేసిన హనుమ-సుగ్రీవులు




వినాశ కాలే విపరీత బుద్ధి, ఆవేశంతో అణగారు సిద్ధి, 
అన్న తమ్ముడిని అవమానించే, అధికారంపై ఆశకొద్దీ,
పలు విధాలుగా నచ్చచెప్పినా, మొండితనానికి కలిగే వృద్ధి,
సూర్య నందనుడు మరచెనుగా, హనుమంతునిలో దాగిన శక్తి, 
అందుకే ఈ భక్తీ మార్గాన ఉండవలసినది, త్రికరణ శుద్ధి.


పదవులెందుకు పట్టమెందుకు సత్యమే లేనప్పుడు,
అనుచు స్వామి, సూర్య సుతునికి ఊతమిచ్చేనప్పుడు.
ధర్మ మర్మం తెలిసి పెద్దలు ప్రవర్తింతురు ఎప్పుడు, 
ఈ వివేచన వదలి వాలి, అఘమునెంచుకొన్నాడు.

-Om Namo Hanumate Namaha-