కురిసే వానలా, కరిగే మంచులా, కదిలే కాలంలా పరుగెందుకు??
ఎగసే కెరటంలా, మెరిసే కిరణంలా శిఖరం చేరాల పదముందుకు!!!కురిసే జడి వాన తెరుపివ్వక మానీనా ?
ఎగిరే యువ కెరటం అలుపంటూ ఆగేనా ??
దట్టమైన పొగమంచు నీ దారిన కమ్మినా...............!
తోలి కిరణం తాకగానే తప్పుకోక రేగేనా ???
కదులుతున్న కాలం, బదులులేని జాలం,
కవ్విస్తూ, నవ్విస్తూ, కంటనీరు పెట్టించే గందరగోళం!!
ఆలోచన ఆలంబన, ఆశలన్నీ ఆచ్చాదన, ఆచరణే ఆశీసులు అయ్యేకాలం!!
వచ్చేసిందిదిగో నీ ముంగిట పుష్పకమై, ఎదురులేని అస్త్రమై!!!!!
పదముందుకు పదముందుకు ఎగసేటి కెరటంలా, మెరిసేటి కిరణంలా, శిఖరాన్ని చేరేల పదముందుకు!!!
No comments:
Post a Comment